ఇవాళ ఆఫ్గనిస్తాన్ తో ఇండియా సెమీస్ ఫైట్

Under-19 World Cup 2026: ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 4) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ కీలక పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, పటిష్టమైన ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతోంది.

హరారే స్పోర్ట్స్ క్లబ్, జింబాబ్వేలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రారంభమవుతుంది.

ఆయుష్ మ్హాత్రే నాయకత్వంలోని భారత జట్టు ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమి అనేది లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించి మంచి ఊపులో ఉన్నారు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు మరియు బౌలర్ హెనిల్ పటేల్ ఫామ్‌లో ఉన్నారు.

ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ఆడిన ఐదు మ్యాచ్‌‌‌‌ల్లో నాలుగింటిలో గెలిచిన అఫ్గాస్తాన్‌‌‌‌ సంచలనంపై కన్నేసిందిసౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్ వంటి జట్లను ఓడించి సెమీస్ చేరిన ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. వారి స్పిన్ బౌలింగ్ భారత్‌కు సవాలుగా మారవచ్చు.ఇప్పటికే నిన్న జరిగిన మొదటి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ భారత్ గెలిస్తే, ఫిబ్రవరి 6న జరిగే గ్రాండ్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో తలపడుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story