Shock for Team India: క్రికెట్ ప్రపంచంలో మరో సంచలనం నమోదైంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియాకు తొలి టీ20లోనే గట్టి షాక్ తగిలింది. పసికూనగా భావించే ఐర్లాండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో టీమిండియాపై 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. క్రికెట్ ఫ్యాన్స్‌ను సైతం ఊహించని షాక్‌కు గురిచేసింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు, భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. భారత బౌలర్లు కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.

ఇక 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 20 బంతుల్లో 50పరుగులు మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఐర్లాండ్ బౌలర్లు లైనప్ అండ్ లెంత్‌తో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. భారత టాప్ ఆర్డర్‌ను కట్టడి చేశారు. వరుస వికెట్లు కోల్పోవడంతో టీమిండియా తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది.

మిడిల్ ఆర్డర్‌లో కొందరు బ్యాట్స్‌మెన్ గెలుపు కోసం పోరాడినప్పటికీ.. ఐర్లాండ్ ఫీల్డర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లక్ష్యానికి 34 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. భారత జట్టులో సమన్వయం లోపించడం, కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకోవడం జట్టు ఓటమికి ప్రధాన కారణాలుగా మారాయి.

ఈ ఓటమి భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ.. ఐర్లాండ్ బౌలింగ్ వ్యూహాలను ఛేదించడంలో టీమిండియా విఫలమైందనే చెప్పాలి. మరోవైపు, ఐర్లాండ్ మాత్రం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లోనూ భారత్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఈ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story