Chris Gayle: వెస్టిండీస్ మాజీ స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్ మరోసారి క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. 47 ఏళ్ల వయసులోనూ ఆయన ఆటపై ఉన్న ఆసక్తి తగ్గలేదు. ఇటాలియా టీ10 లీగ్‌లో పాల్గొనడానికి నిర్ణయం తీసుకున్న గేల్, వెనిస్ లైవ్‌వైర్స్ జట్టు తరఫున ఆడనున్నాడు.


ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగే లీగ్‌ల్లో తప్పనిసరిగా కనిపించే విధ్వంసక బ్యాటర్ గేల్, కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ లీగ్ బాట పట్టాడు. టీ10 ఫార్మాట్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని, ఇటలీ అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నానని గేల్ అన్నాడు.


వెనిస్ లైవ్‌వైర్స్ జట్టు డైరెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, గేల్ అనుభవం, ఆటపై అతనికున్న అవగాహన జట్టుకు చాలా ఉపయోగపడుతుందని చెప్పాడు. గేల్‌కు స్వాగతం పలికాడు.


ఇటాలియా టీ10 లీగ్ నవంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. గేల్ ఆడటంతో ఈ లీగ్‌కు అదనపు ఆకర్షణ చేకూరనుంది.

Next Story