సెమీస్ కు సినర్

US Open 2025: ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినర్ యూఎస్ ఓపెన్ 2025 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించారు. క్వార్టర్-ఫైనల్‌లో తన సహచరుడు లోరెంజో ముసెట్టిని ‌‌‌‌‌‌‌ 6–1, 6–4, 6–2తో పదో సీడ్‌‌‌‌‌‌‌‌ లో ఓడించి సెమీస్‌లోకి దూసుకెళ్లారు. సినర్‌‌‌‌‌‌‌‌కు ఇది వరుసగా ఐదో గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌ . అలాగే హార్డ్‌‌‌‌‌‌‌‌ కోర్ట్స్‌‌‌‌‌‌‌‌పై జరిగిన మేజర్‌‌‌‌‌‌‌‌ టోర్నీల్లో వరుసగా 26 విజయాలు సాధించాడు. ఇందులో గత రెండు ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌, 2024 యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి.

ఈ విజయంతో, సినర్ తన డిఫెండింగ్ ఛాంపియన్ టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో మరో అడుగు వేశారు. సెమీ-ఫైనల్‌లో అతను కెనడా ఆటగాడు ఫెలిక్స్ అగర్-అలియాసిమ్‌తో తలపడనున్నారు.

సినర్ గెలిచిన టైటిల్స్.

2024 ఆస్ట్రేలియన్ ఓపెన్: తన కెరీర్‌లో మొదటి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

2024 యూఎస్ ఓపెన్: రెండో గ్రాండ్ స్లామ్ గెలుచుకుని, ఒకే సంవత్సరంలో రెండు హార్డ్ కోర్ట్ గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

2025 ఆస్ట్రేలియన్ ఓపెన్: తన మూడవ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడు.

2025 వింబుల్డన్: కార్లోస్ అల్కరాజ్‌ను ఓడించి తన మొదటి వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story