యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్

US Open 2025 Starts Today: ఈరోజు, రేపు రెండు రోజుల పాటు యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్ జరుగుతుంది.ఈ రోజు, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లోని మొదటి,రెండవ రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. రేపు (ఆగస్టు 20న) సెమీ-ఫైనల్స్, ఫైనల్స్ ఉంటాయి.

మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్‌లో నొవాక్ జొకోవిచ్ , ఓల్గా డానిలోవిచ్ జోడీ మిర్రా ఆండ్రీవా, డానిల్ మెద్వెదెవ్ (Daniil Medvedev) జోడీతో తలపడతారు. కార్లోస్ అల్కరాజ్ , ఎమ్మా రదుకాను జోడీ టాప్ సీడ్‌లు అయిన జెస్సికా పెగులా, జాక్ డ్రేపర్ జోడీతో పోటీపడతారు. సారా ఎర్రాని, ఆండ్రియా వవాస్సోరి (Andrea Vavassori) తమ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించనున్నారు.

యూఎస్ ఓపెన్ ప్రధాన టోర్నమెంట్ ఆగస్టు 24న మొదలై సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతుంది. న్యూయార్క్ నగరంలోని USTA బిల్లీ జీన్ కింగ్ నేషనల్ టెన్నిస్ సెంటర్. ఈసారి మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌ను టోర్నమెంట్ ప్రధాన డ్రాకు ముందే నిర్వహించడం విశేషం. మిక్స్‌డ్ డబుల్స్ విజేత జట్టుకు వన్ మిలియన్ డాలర్ల బహుమతి లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story