ఫైనల్ కు అరీనా సబలెంకా

US Open: యూఎస్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో ప్రపంచ నంబర్ 1, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన సబలెంకా, జెస్సికా పెగులాను 4-6, 6-3, 6-4 తేడాతో ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆమె వరుసగా మూడోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరుకుంది. ఫైనల్‌లో అరీనా సబలెంకా, అమెరికాకు చెందిన అమండా అనిసిమోవా తలపడనున్నారు. వీరిద్దరి మధ్య గతంలో జరిగిన మ్యాచ్‌లలో అనిసిమోవా 6-3 తేడాతో ముందంజలో ఉంది. అయితే, ఇది వారిద్దరికీ గ్రాండ్ స్లామ్ ఫైనల్‌లో తొలి ముఖాముఖి కానుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 6న మ్యాచ్ జరగనుంది.

8వ సీడ్ అనిసిమోవా మరో సెమీ-ఫైనల్లో నవోమి ఒసాకాను 6-7, 7-6, 6-3 తేడాతో ఓడించి తన కెరీర్‌లో రెండో గ్రాండ్ స్లామ్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. 2 గంటల 56 నిమిషాల ఈ పోరులో ఒసాకా ఒక దశలో విజయం అంచున నిలిచినా అనిసిమోవా తన శక్తివంతమైన గ్రౌండ్‌‌‌‌స్ట్రోక్స్‌‌‌‌తో ఆమెను ఓడించింది. గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్‌‌‌‌లో 14–0తో ఉన్న ఒసాకా రికార్డును అనిసిమోవా బద్దలు కొట్టింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story