అల్కరాజ్ దే టైటిల్

US Open Champion: కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్ 2025 టోర్నమెంట్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ నంబర్ 1 ఆటగాడు అయిన జానిక్ సిన్నర్ ను 6-2, 3-6, 6-1, 6-4 స్కోరుతో ఓడించి తన కెరీర్ లో రెండో యూఎస్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్నాడు.

ఈ విజయంతో అల్కరాజ్ మళ్ళీ ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ ను కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఫైనల్లో తలపడటం ఇది మూడోసారి. ఇంతకు ముందు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ లో అల్కరాజ్ గెలవగా, వింబుల్డన్ ఫైనల్ లో సిన్నర్ విజయం సాధించాడు. అల్కరాజ్ సినర్ తో జరిగిన గత ఎనిమిది మ్యాచ్ ల్లో ఏడింటిలో అల్కరాజే విజయం సాధించాడు.

యూఎస్ ఓపెన్ ఫైనల్ లో అల్కరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా అతని సర్వీస్ , ఫోర్హ్యాండ్ షాట్లు చాలా హైలెట్ గా నిలిచాయి. సిన్నర్ కూడా బాగా పోరాడినా, అల్కరాజ్ ఆల్-రౌండ్ గేమ్ ముందు నిలబడలేకపోయాడు. ఈ విజయంతో అల్కరాజ్ తన ఆరో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను కూడా సొంతం చేసుకున్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story