సెమీస్ కు పెగాలా

US Open Tennis: యూఎస్ ఓపెన్ టెన్నిస్ 2025లో అమెరికా క్రీడాకారిణి జెస్సికా పెగులా సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంది. సెప్టెంబర్ 2న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె బార్బోరా క్రెజికోవాను 6-3, 6-3 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. ఇది పెగులాకు వరుసగా రెండో యూఎస్ ఓపెన్ సెమీ-ఫైనల్. గత సంవత్సరం కూడా ఆమె సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంది.ఆమె సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో టాప్ సీడ్ అరీనా సబలెంకాతో తలపడనుంది. సబలెంకా క్వార్టర్ ఫైనల్స్‌లో మార్కెట వొండ్రోసోవా గాయం కారణంగా వాకోవర్ ఇవ్వడంతో నేరుగా సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

మరోవైపు, పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో కార్లోస్ అల్కరాజ్ సెమీ-ఫైనల్స్‌కు చేరుకున్నాడు. జానిక్ సినర్ కూడా పురుషుల క్వార్టర్ ఫైనల్స్‌లో తన మ్యాచ్ ఆడబోతున్నాడు. ప్రిక్వార్టర్స్‌‌లో కజకిస్తాన్‌‌ ప్లేయర్‌‌‌‌ అలెగ్జాండర్ బబ్లిక్‌‌ను కేవలం 81 నిమిషాల్లోనే చిత్తు చేసి యానిక్ సినర్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌‌లో టాప్ సీడ్ సినర్ 6–-1, 6–-1, 6–-1 తో బబ్లిక్‌‌ను మట్టికరిపించాడు. ఈ టోర్నమెంట్‌‌ హిస్టరీలో సెకండ్ ఫాస్టెస్ట్ మ్యాచ్‌‌గా నిలిచిన ఈ పోరులో ఆరంభం నుంచి చివరి వరకు సినర్ అదరగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో 8 ఏస్‌‌లు, 8 బ్రేక్ పాయింట్లు, 10 నెట్‌‌ పాయింట్లు, 24 విన్నర్లతో విజృంభించాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story