అమెరికా గ్రాండ్ విక్టరీ

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అమెరికా (USA) జట్టు నెదర్లాండ్స్‌పై 93 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా 196/6 (20 ఓవర్లలో) చేసింది. తెలుగు కుర్రాడు సాయి తేజ ముక్కామల కేవలం 51 బంతుల్లో 79 పరుగులు (5 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో శుభమ్ రంజనే (48*) మెరుపులు మెరిపించాడు.

197 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 103 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్పిన్నర్ హర్మీత్ సింగ్ 4 వికెట్లు (4/21) తీసి నెదర్లాండ్స్ వెన్నువిరిచాడు. అతడికి తోడుగా షాడ్లీ వాన్ షాల్‌విక్ 3 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అమెరికా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హర్మీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

అంతర్జాతీయ టీ20ల్లో నెదర్లాండ్స్‌పై అమెరికాకు ఇదే తొలి విజయం. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక అసోసియేట్ జట్టు సాధించిన అతిపెద్ద విజయం (పరుగుల పరంగా) ఇదే కావడం విశేషం. వరుసగా భారత్, పాకిస్థాన్‌ల చేతిలో ఓడిన తర్వాత అమెరికా ఈ టోర్నీలో సాధించిన మొదటి విజయం ఇది.

PolitEnt Media

PolitEnt Media

Next Story