Kapil Dev: భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు వినిపిస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే రికార్డులను తిరగరాస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ లో తన బ్యాటింగ్‌తో దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా ఈ వండర్ కిడ్‌పై టీమిండియా లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైభవ్ ప్రతిభ అసాధారణమైనదని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని కపిల్ కొనియాడారు.

కపిల్ దేవ్ ఒకప్పుడు సచిన్ టెండూల్కర్‌ను గుర్తు చేసుకుంటూ.. "16 ఏళ్ల వయసులో భారత గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ ఎలా ఉన్నాడో.. ఇప్పుడు వైభవ్ కూడా అలాగే రాణిస్తున్నాడు అంటూ ఆకాశానికెత్తేశారు. అయితే.. ప్రశంసలతో పాటే వైభవ్ భవిష్యత్తుపై కపిల్ దేవ్ కొన్ని కీలకమైన సందేహాలను, హెచ్చరికలను కూడా పంచుకున్నారు.

16 ఏళ్ల వయసులో సచిన్ లాగే కనిపిస్తున్న వైభవ్.. సచిన్ లాగా అంత సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడగలడా? అని కపిల్ ప్రశ్నించారు. వైభవ్‌కు ఇప్పుడు కేవలం 15 సంవత్సరాలేనని.. కెరీర్ లో అతను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని గుర్తు చేశారు.

కపిల్ దేవ్ మాటల్లోని అసలు అంతరార్థం ఏమిటంటే.. ప్రస్తుతం వైభవ్‌కు తెలిసిందల్లా కేవలం క్రికెట్ ఒక్కటే! కానీ, అతనికి 20 నుంచి 22 ఏళ్లు వచ్చాకే కెరీర్ లో అసలైన సవాళ్లు ఎదురవుతాయి. ఎందుకంటే ఆ వయసులోనే అతనికి జీవితం గురించి పూర్తిగా తెలుస్తుందని.. అప్పుడు పరిస్థితులు, ప్రాధాన్యతలు మారుతాయని కపిల్ అభిప్రాయపడ్డారు.

అందుకే వైభవ్ సూర్యవంశీకి 20-22 ఏళ్లు వచ్చాకే అతని అసలైన ప్రదర్శనపై, కెరీర్‌పై ఒక అంచనాకు రాగలమని కపిల్ స్పష్టం చేశారు. అప్పటి వరకు మీడియా కానీ, అభిమానులు కానీ అతడిపై అనవసరమైన అంచనాల ఒత్తిడిని పెంచి.. కెరీర్ ను నాశనం చేయొద్దని ఒక హితవు పలికారు.ఐపీఎల్‌లో ఆడటం వేరు.. దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం వేరు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అని కపిల్ అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story