Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఊచకోత..గేల్ 14 ఏళ్ల రికార్డ్ బద్దలు
గేల్ 14 ఏళ్ల రికార్డ్ బద్దలు

Vaibhav Suryavanshi: ఐపీఎల్ చరిత్రలోనే మున్నెన్నడూ లేని సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఐపీఎల్ ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొడుతూ 15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అందరూ ఊహించినట్లుగానే ఒకే ఒక్క ఐపీఎల్ సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వీరుడిగా వైభవ్ విశ్వరూపం చూపించాడు.
అంటే సరిగ్గా 14 ఏళ్ల క్రితం, 2012 ఐపీఎల్ సీజన్ లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఏకంగా 59 సిక్సర్లు బాది ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. కానీ, తాజాగా జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ సునామీ సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడుతూ.. ఏకంగా 12 భారీ సిక్సర్లతో ఊచకోత కోశాడు. ఈ క్రేజీ ఇన్నింగ్స్‌తో క్రిస్ గేల్ పేరిట ఉన్న 14 ఏళ్ల నాటి రికార్డును ఈ 15 ఏళ్ల కుర్రాడు చెరిపేశాడు. ఈ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ బాదిన మొత్తం సిక్సర్ల సంఖ్య అక్షరాలా 65 కి చేరింది.
ఈ చారిత్రాత్మక మ్యాచ్ లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ హిస్టరీలోనే నిలిచిపోతుంది. కేవలం 29 బంతుల్లోనే.. 12 సిక్సర్లు, 5 ఫోర్లతో 97 పరుగులు చేసి సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో దురదృష్టవశాత్తూ ఔటయ్యాడు. కానీ, అప్పటికే ఐపీఎల్ చరిత్రను తిరగరాసి పడేశాడు.

