సౌతాఫ్రికాదే సిరీస్

South Africa Wins the Series: సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. సౌతాఫ్రికా 84 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆధిపత్యం ప్రదర్శించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా జట్టు 277 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో మ్యాథ్యూ బ్రీట్‌జ్కే 88 పరుగులతో అద్భుతంగా రాణించాడు. స్టాన్ స్టబ్స్ 74 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు సాధించడంలో తోడ్పడ్డాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు, నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు తీశారు.278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 193 పరుగులకే ఆలౌట్ అయింది.ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ 87 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా, మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు.బౌలింగ్‌లో లుంగీ ఎన్‌గిడి 5 వికెట్లతో చెలరేగి ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు.ఎన్‌గిడికి తోడుగా నాండ్రే బర్గర్, సెనురన్ ముత్తుసామి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఈ విజయంతో సౌతాఫ్రికా వరుసగా ఐదో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియాపై గెలుచుకుంది.మ్యాథ్యూ బ్రీట్‌జ్కే తన మొదటి నాలుగు వన్డేలలోనూ 50 పరుగులకు పైగా స్కోరు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఓటమితో ఆస్ట్రేలియా గత ఎనిమిది వన్డేలలో ఏడు ఓటములను చవిచూసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story