తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ కైవసం

Vijay Hazare Trophy: దేశవాళీ క్రికెట్‌లో ఒక చారిత్రాత్మక ఘట్టం. విదర్భ జట్టు అద్భుత ప్రదర్శనతో తొలిసారి విజయ్ హజారే ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో విదర్భ జట్టు ప్రత్యర్థిని ఓడించి తమ మొదటి వన్డే టైటిల్‌ను ముద్దాడింది. బ్యాటింగ్, బౌలింగ్,ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో విదర్భ ఆటగాళ్లు సమన్వయంతో రాణించారు. ఇప్పటికే రెండుసార్లు రంజీ ట్రోఫీ (2017-18, 2018-19) గెలిచిన విదర్భ, ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.

ఓపెనర్ అథర్వ తైడే (128) సెంచరీతో విజృంభించడంతో ఫైనల్లో 38 రన్స్ తేడాతో రెండుసార్లు చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సౌరాష్ట్రను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 317/8 స్కోరు చేసింది. సూపర్ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న అథర్వకు తోడు యశ్ రాథోడ్ (54) ఫిఫ్టీతో సత్తా చాటాడు. అమన్ మోఖడే (33) కూడా ఫర్వాలేదనిపించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో అంకుర్ పన్వార్ (4/65) నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌరాష్ట్ర 48.5 ఓవర్లలో 279 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది

టోర్నీ ఆరంభం నుండి లీగ్ దశలోనూ, నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ విదర్భ ఓటమెరుగని పోరాట పటిమను కనబరిచింది. జట్టులోని సీనియర్ ఆటగాళ్ల అనుభవం, యువ ఆటగాళ్ల ఉత్సాహం తోడవడమే ఈ గెలుపుకు పునాది.

కోచింగ్ స్టాఫ్ రూపొందించిన వ్యూహాలను మైదానంలో ఆటగాళ్లు పక్కాగా అమలు చేశారు..ఈ విజయం కేవలం ఆటగాళ్లది మాత్రమే కాదు, విదర్భ క్రికెట్ అసోసియేషన్ నమ్మకానికి పట్టుదలకు నిదర్శనం.ఈ విజయంతో విదర్భ జట్టు భారత దేశవాళీ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story