Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ: మయాంక్ కెప్టెన్సీలో కేఎల్ రాహుల్.. టీమ్ ఫుల్ జోష్!
టీమ్ ఫుల్ జోష్!

Vijay Hazare Trophy: దేశవాళీ వన్డే టోర్నీ'విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ కోసం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తమ పటిష్టమైన 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ కర్ణాటక, స్టార్ ప్లేయర్ల రాకతో మరింత బలోపేతంగా కనిపిస్తోంది. టీమిండియా స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణలు ఈ జట్టులో చేరడం కర్ణాటకకు పెద్ద సానుకూల అంశం. బీసీసీఐ ఆదేశాల మేరకు వీరు దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగుతున్నారు. వీరి అనుభవం జట్టుకు కొండంత అండగా నిలవనుంది. ఇక జట్టు పగ్గాలను వెటరన్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అందుకోగా, వైస్ కెప్టెన్‌గా కరుణ్ నాయర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
కుర్రాళ్లకు పెద్ద పీట
సీనియర్లతో పాటు అండర్-23 టోర్నీలో అదరగొట్టిన యువ ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం కల్పించారు. హర్షిల్ ధర్మాని తమిళనాడుపై 142 పరుగులతో సత్తా చాటాడు. ధ్రువ్ ప్రభాకర్ విదర్భపై 126 పరుగులతో సెంచరీ చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. వీరితో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా శ్రీష ఆచార్ జట్టులోకి వచ్చాడు.
డిసెంబర్ 24న తొలి పోరు
కర్ణాటక జట్టు తన తొలి మ్యాచ్‌ను డిసెంబర్ 24న జార్ఖండ్‌తో ఆడనుంది. ఈ టోర్నీలో గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. విశేషమేమిటంటే.. ఈసారి విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి టీమిండియా దిగ్గజాలు కూడా ఆడే అవకాశం ఉండటంతో టోర్నీపై ఆసక్తి పెరిగింది.
కర్ణాటక జట్టు వివరాలు
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), కరుణ్ నాయర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణ, దేవదత్ పడిక్కల్, స్మరణ్, శ్రీజిత్, అభినవ్ మనోహర్, శ్రేయాస్ గోపాల్, వ్యాషాక్, మన్వంత్ కుమార్, శ్రీషా S ఆచార్, అభిలాష్ శెట్టి, శరత్, హర్షిల్ ధర్మాని, ధ్రువ్ ప్రభాకర్.

