రంగంలోకి దిగిన రోకో

Vijay Hazare Trophy: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఈ సారి టోర్నీకి ఒక ప్రత్యేకత ఏంటంటే..చాలా కాలం తర్వాత టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ రాష్ట్ర జట్ల తరపున బరిలోకి దిగుతున్నారు.

ఇవాళ ఆంధ్రప్రదేశ్ తో ఢిల్లీ తలపడుతోంది. బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్సీ వహిస్తుండగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 15 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో ఆడుతున్నారు.

ముంబైతో సిక్కిం తలపడుతోంది . జైపూర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ముంబై తరపున ఆడుతున్నారు. టాస్ గెలిచిన సిక్కిం బ్యాటింగ్ ఎంచుకోవడంతో రోహిత్ ప్రస్తుతం ఫీల్డింగ్ చేస్తున్నారు.హైదరాబాద్ తో ఉత్తరప్రదేశ్ తలపడుతోంది రాజ్‌కోట్‌ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. తమిళనాడుతో పుదుచ్చేరి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ సాగుతోంది.

మొత్తం జట్లు: 38 (32 ఎలైట్ జట్లు, 6 ప్లేట్ జట్లు). రోహిత్, కోహ్లీలతో పాటు రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా వంటి ప్రముఖులు వివిధ జట్ల తరపున పాల్గొంటున్నారు.ఫైనల్ మ్యాచ్ జనవరి 18, 2026న జరుగుతుంది.

అభిమానుల కోసం కేవలం కొన్ని ఎంపిక చేసిన మ్యాచ్‌లు (ఉదా: తమిళనాడు vs పుదుచ్చేరి, హైదరాబాద్ vs యూపీ) మాత్రమే స్టార్ స్పోర్ట్స్ , హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా కోహ్లీ ఆడుతున్న మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదు.

Updated On 24 Dec 2025 12:07 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story