Virat Kohli Breaks Sachin Tendulkar’s World Record: సచిన్ వరల్డ్ రికార్డ్ ను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ
రికార్డ్ ను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

Virat Kohli Breaks Sachin Tendulkar’s World Record: ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ రెండు చారిత్రాత్మక ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. వడోదరలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆయన 93 పరుగులు చేసి, భారత విజయానికి పునాది వేశారు. దురదృష్టవశాత్తు 93 పరుగుల వద్ద ఔట్ కావడంతో తన 85వ అంతర్జాతీయ సెంచరీని తృటిలో కోల్పోయారు. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్ట్, వన్డే, టీ20 కలిపి) 28,000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలిచారు.624 ఇన్నింగ్స్‌లు తో సచిన్ రికార్డును(644 ఇన్నింగ్స్‌లు) 20 ఇన్నింగ్స్‌ల ముందే బ్రేక్ చేశారు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (28,016 పరుగులు) రికార్డును కూడా అధిగమించారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు కోహ్లీ కంటే ముందు కేవలం సచిన్ టెండూల్కర్ (34,357 పరుగులు) మాత్రమే ఉన్నారు.అన్ని ఫార్మాట్లు కలిపి సచిన్ టెండూల్కర్ 34,357 ,విరాట్ కోహ్లీ28,068, కుమార సంగక్కర (శ్రీలంక)28,016 ఉన్నారు. తర్వాతి వన్డేలో కోహ్లీ మరిన్ని రికార్డులు ఉదాహరణకు వన్డేల్లో 15,000 పరుగులు సాధించే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

