✕
Virat Kohli: రాయ్‌పుర్‌లో విరాట్ కోహ్లీకి గ్రాండ్ వెల్‌కమ్
By PolitEnt MediaPublished on 2 Dec 2025 11:53 AM IST
విరాట్ కోహ్లీకి గ్రాండ్ వెల్‌కమ్

x
Virat Kohli: సౌతాఫ్రికాతో రాంచీలో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా రెండో వన్డే కోసం రాయ్‌పుర్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌కు షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. భారత జట్టు సోమవారం సాయంత్రం రాయ్‌పుర్‌కు చేరుకోగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి లభించిన స్వాగతం అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్లేయర్లు హోటల్‌లోకి వెళ్లే ముందు చిన్నారులు కోహ్లీని చుట్టుముట్టారు. తమ అభిమాన ఆటగాడిని చూసి సంబరపడిన పిల్లలు, అతనికి స్వాగతం చెబుతూ ప్రేమతో ఎర్ర గులాబీలను అందించారు.
కోహ్లీ కూడా చిరునవ్వుతో ఆ గులాబీలను స్వీకరించి, నెమ్మదిగా ముందుకు కదిలాడు. ఈ దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత జట్టు ఇప్పుడు రెండో వన్డే కోసం సన్నద్ధమవుతోంది.

PolitEnt Media
Next Story
