Board of Control for Cricket in India (BCCI): బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్?
వీవీఎస్ లక్ష్మణ్?

Board of Control for Cricket in India (BCCI): భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి సంబంధించి ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో ఒక పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయనే మన మిస్టర్ డిపెండబుల్, నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్
ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియనుండటంతో, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి బీసీసీఐ పెద్దలు లక్ష్మణ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే, ఈ బాధ్యతలను స్వీకరించే విషయంలో లక్ష్మణ్ ముందు కొన్ని సవాళ్లు, వ్యక్తిగత ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం NCA హెడ్‌గా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్న లక్ష్మణ్.. సెలక్షన్ కమిటీ బాధ్యతలను చేపడతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ వీవీఎస్ లక్ష్మణ్ గనుక చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తే, భారత జట్టు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకం కానుంది. రాబోయే టోర్నమెంట్లు, యువ ఆటగాళ్లకు అవకాశాలు, సీనియర్ల భవితవ్యం వంటి కీలక నిర్ణయాలన్నీ ఆయన చేతికే వెళ్లే అవకాశం ఉంది. అయితే, ఈ పదవిపై బీసీసీఐ అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

