Harbhajan Singh: భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన 'టర్బనేటర్' హర్భజన్ సింగ్ తాజాగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. సరిగ్గా 26 సంవత్సరాల క్రితం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) నుండి తనను ఎందుకు బయటకు గెంటేశారో అనే దానిపై ఆయన తొలిసారిగా ఓపెన్‌గా మాట్లాడారు. ఆ వెనుక అసలు ఏం జరిగిందంటే?

సంవత్సరం 2000లో బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) తొలి బ్యాచ్ ట్రైనీలలో హర్భజన్ సింగ్ కూడా ఒకరు. అయితే అక్కడ అప్పట్లో ఆటగాళ్లకు ఇస్తున్న ఆహార నాణ్యత చాలా పేలవంగా ఉండేదట. బోర్డు అధికారులు గోడపై ఒక డైట్ చార్ట్ అతికించారని, ఎక్స్‌పర్ట్స్ సూచించిన ప్రకారం ఆ డైట్ ప్రకారం ఎలాంటి food ఇవ్వడం లేదని భజ్జీ గుర్తుచేసుకున్నారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారుల్లో మార్పు రాలేదని తెలిపారు.

ఆహారంలో నాణ్యత లేకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన హర్భజన్ సింగ్, ఒకరోజు విసిగిపోయి ఆ డైట్ చార్ట్‌ను చింపివేశారట. "నేను చేసింది ఆ ఒక్క తప్పు మాత్రమే... డైట్ చార్ట్ చించడం" అని భజ్జీ చెప్పారు. కానీ, తాను ఆటగాళ్ల హక్కుల కోసం, సరైన ఆహారం కోసం పోరాడానని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో బోర్డులో (BCCI) కొందరికి ఎదిరించే వాళ్ళు అంటే ఇష్టం లేదని, అందుకే తనను కావాలనే NCA నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు.

అయితే ఆ తర్వాత తన కఠిన శ్రమతో అద్భుతమైన రీతిలో పునరాగమనం చేసి టీమిండియా తరఫున ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించానని హర్భజన్ గుర్తుచేసుకున్నారు. ఏదేమైనప్పటికీ, రెండున్నర దశాబ్దాల తర్వాత భజ్జీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story