Jason Holder: వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్!
జేసన్ హోల్డర్!

Jason Holder: వెస్టిండీస్ క్రికెట్ జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని విండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ వెల్లడించారు. టెస్టు క్రికెట్‌లో హోల్డర్ ఇంకా కొనసాగుతారని, అయితే వన్డేల నుంచి తప్పుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. హోల్డర్ వన్డేలకు వీడ్కోలు పలకడం విండీస్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
2013 నుండి 2023 వరకు జేసన్ హోల్డర్ విండీస్ తరపున 138 వన్డేలు ఆడి 2237 పరుగులు చేయడంతో పాటు 159 వికెట్లు పడగొట్టారు. 86 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయన, తన నాయకత్వంలో జట్టుకు 24 విజయాలను అందించారు. 2015, 2019 ప్రపంచకప్‌లలో ఆయన జట్టుకు నాయకత్వం వహించారు. హోల్డర్ చివరిసారిగా జూలై 2023లో జింబాబ్వేపై తన చివరి వన్డే మ్యాచ్ ఆడారు.
ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ 10వ స్థానంలో ఉంది. 2027 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే వారు తమ ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకోవాల్సి ఉంది. దీనిపై స్పందించిన కోచ్ సామీ, టీమ్ క్వాలిఫికేషన్ కోసం తాము కష్టపడుతున్నామని, మిగిలిన మ్యాచ్‌లలో గెలిచి ర్యాంకింగ్స్‌లో పైకి రావడమే తమ లక్ష్యమని చెప్పారు. ఫ్రాంచైజీ లీగుల బిజీలో ఉన్నప్పటికీ, టెస్టు క్రికెట్ ఆడేందుకు హోల్డర్ ఆసక్తి చూపిస్తున్నారని సామీ తెలిపారు.

