Indian Premier League: ఐపీఎల్లో ఫోన్ల వాడకంపై బీసీసీఐ నిబంధనలు ఏమిటి?
బీసీసీఐ నిబంధనలు ఏమిటి?

Indian Premier League: ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు స్టేడియంలోని కొన్ని ప్రాంతాలను 'పరిమిత ప్రాంతాలు' (Restricted Areas) లేదా 'ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా' (PMOA) అని పిలుస్తారు. అవినీతికి తావులేకుండా ఆటను పారదర్శకంగా నిర్వహించడం కోసం బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ACSU) ఈ ప్రాంతాల్లో ఫోన్ల వాడకంపై చాలా కఠినమైన నిబంధనలను అమలు చేస్తుంది. సాధారణంగా ఆటగాళ్లు, కోచ్‌లు లేదా సహాయక సిబ్బంది డ్రెస్సింగ్ రూమ్ లేదా డగౌట్‌లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లను వాడకూడదు. మ్యాచ్ ప్రారంభానికి ముందే అందరూ తమ ఫోన్లను అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.
అయితే, టీమ్ మేనేజర్‌కు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి. మేనేజర్ తన వద్ద ఫోన్ ఉంచుకోవడానికి అనుమతి ఉన్నప్పటికీ, దానిని కేవలం అత్యవసర పరిపాలనా పనుల కోసం మాత్రమే వాడాలి. డగౌట్‌లో కూర్చున్నప్పుడు ఫోన్ వాడటం లేదా ఆటగాళ్లకు స్క్రీన్ చూపించడం వంటివి నిబంధనల అతిక్రమణ కిందకు వస్తాయి. రోమీ భిందర్ విషయంలో ఆయన ఫోన్ వాడుతున్నప్పుడు ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా అందులోకి చూడటం వల్లే ఈ వివాదం ఇంత పెద్దదైంది. దీనిపై బీసీసీఐ అంతర్గత విచారణ జరుపుతోంది.
రోమీ భిందర్ ఆరోగ్యం దెబ్బతినడం వల్లే అత్యవసర చికిత్స కోసం తన వద్ద ఫోన్ ఉంచుకున్నారని సమాచారం అందుతోంది. ఆయన గతంలో ఊపిరితిత్తుల సమస్యతో వెంటిలేటర్‌పై ఉన్నారని, అందుకే మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఫోన్ అందుబాటులో ఉంచుకున్నారని తెలుస్తోంది. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా డగౌట్‌లో ఫోన్ వాడకంపై ఉన్న ఆంక్షలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. ఈ విచారణ పూర్తయ్యే వరకు హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఆయనకు అనుమతి ఉంటుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ విషయంపై స్పందిస్తూ, నిబంధనలు ఎక్కడైనా ఉల్లంఘించబడ్డాయా అనే దానిపై క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

