మహిళల జట్టు చేసింది:అశ్విన్

Ashwin Ravichandran: భారత మహిళల జట్టు ప్రపంచ కప్ గెలవడంపై రవిచంద్రన్ అశ్విన్ చాలా గొప్పగా, భావోద్వేగభరితంగా స్పందించారు. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఘనత అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అభిప్రాయపడ్డారు.

"మనం గెలిచిన ఏ ఇతర ప్రపంచ కప్‌ల (పురుషుల) కంటే కూడా ఇది చాలా పెద్ద, భారీ విజయం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, ఈ విజయం దేశంలోని ప్రతి అమ్మాయిని క్రికెట్ ఆడటానికి, క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి ప్రేరేపిస్తుంది."ఈ విజయం భారత మహిళల క్రికెట్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన విధానాన్ని, మానసిక స్థితిని మారుస్తుంది.

"నేను నా స్నేహితుడు జడ్డూ (రవీంద్ర జడేజా)కి, ఇతర ఆల్ రౌండర్లందరికీ సారీ చెప్పాలి. ప్రస్తుతం వన్డేల్లో ప్రపంచంలోనే ఉత్తమ ఆల్ రౌండర్ దీప్తి శర్మ. ఆమె బ్యాటింగ్‌లో 35-36 సగటు, బౌలింగ్‌లో 26 సగటు కలిగి ఉంది." ఫైనల్‌లో దీప్తి శర్మ (58 పరుగులు , 5 వికెట్లు) ప్రదర్శనను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ఆమె 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌' అవార్డు గెలుచుకోవడం పట్ల అభినందనలు తెలిపారు.

ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ప్రస్తుత జట్టు, మాజీ దిగ్గజాలు అయిన మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి, అంజుమ్ చోప్రా వంటివారికి ట్రోఫీని అందించి గౌరవించింది. ఈ చర్య తనను ఎంతగానో ఆకట్టుకుందని అశ్విన్ అన్నారు. "భారత పురుషుల జట్టు ఇలాంటి గొప్ప పనిని ఎప్పుడూ చేయలేదు. ఆడిన ఆటగాళ్లకు మాత్రమే కాకుండా, గతంలో దీని కోసం కృషి చేసినవారికి క్రెడిట్ ఇవ్వడం అద్భుతమైన విషయం."

కపిల్ దేవ్, ధోనీ తరహాలో: కపిల్ దేవ్ (1983), ఎం.ఎస్. ధోనీ (2007, 2011) విజయాల గురించి మనం మాట్లాడుకున్నట్లే, హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నాటిన ఈ బీజం గురించి కూడా రాబోయే తరాలు మాట్లాడుకుంటాయని అశ్విన్ పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story