Ashwin: భారత క్రికెట్ చరిత్రలోనే 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే టీమిండియా తరపున అరంగేట్రం చేసి... అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ.ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో... 10 బంతుల్లో 14 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయినా... తను ఆడిన తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంది.

ఈ యువ సంచలనం ఆటపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ చూపించింది కేవలం 'ట్రైలర్' మాత్రమేనని అశ్విన్ కొనియాడాడు.అశ్విన్ మాటల్లో చెప్పాలంటే...జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ లాంటి అంతర్జాతీయ బౌలర్ల బౌలింగ్‌లో వైభవ్ ఎలాంటి బెరుకు లేకుండా, దూకుడుగా ఆడటం నాకు బాగా నచ్చింది. అంతర్జాతీయ వేదికపై అడుగుపెడుతున్నా అతని ముఖంలో ఏమాత్రం భయం కానీ, ఒత్తిడి కానీ కనిపించలేదు. తను ఎంత వేగంగా ఆడగలడో ఆ ఉద్దేశాన్ని ట్రైలర్‌లోనే చూపించేశాడు.

అయితే ఈ యువ క్రికెటర్ భవిష్యత్తుపై అశ్విన్ ఒక కీలకమైన సలహా ఇచ్చాడు."వైభవ్ ఇప్పుడే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అతనికి సుదీర్ఘ కెరీర్ ఉంది. దయచేసి వైభవ్‌ను ఎవరితోనూ పోల్చకండి. అతన్ని రెండో బ్రాడ్‌మన్ అనో, రెండో సచిన్ టెండూల్కర్ అనో పిలిచి ఒత్తిడి పెంచొద్దు. అతన్ని మొదటి వైభవ్ సూర్యవంశీగానే ఉండనిద్దాం. నిరంతరం నేర్చుకుంటూ అతను సాగించే ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని చూసి ఆనందిద్దాం.అని అశ్విన్ అన్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story