Dhoni Like Inside the Dressing Room: ధోనీ డ్రెస్సింగ్ రూంలో ఎలా ఉండేవాడంటే.?
ఎలా ఉండేవాడంటే.?

Dhoni Like Inside the Dressing Room: క్రికెట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మైక్ హస్సీ, వారి అనుబంధాన్ని గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ధోనీ గదిలో CSK ఆటగాళ్లు ఎలా కలిసి మెలిసి ఉండేవాళ్లో హస్సీ తెలిపారు.
ధోనీ రూమ్ ఎప్పుడూ 24 గంటలూ తెరిచే ఉండేదని, ఎవరైనా ఎప్పుడైనా అక్కడికి వెళ్లి కూర్చోవచ్చని హస్సీ తెలిపారు.ధోనీ గది ఒక అనధికారిక టీమ్ లాంజ్ రూమ్ లా ఉండేదని, ఆటగాళ్లు అక్కడ కూర్చుని, సరదాగా మాట్లాడుకుంటూ, క్రికెట్ గురించి చర్చించుకునేవారని చెప్పారు.ధోనీ తన గదిని ఆటగాళ్ల కోసం తెరవడం ద్వారా టీమ్‌లో వాతావరణం చాలా సరదాగా, స్నేహపూర్వకంగా ఉండేదని, చిన్న ఆటగాళ్లు, సీనియర్లు అనే భేదం లేకుండా అందరూ సులభంగా కలిసిపోయేందుకు ఇది సహాయపడింది అన్నారు.
చాలా మంది ఆటగాళ్లు తమతో పాటు భోజనం తీసుకువచ్చేవారని, అక్కడ కలిసి తినేవారని హస్సీ వివరించారు.
ఈ విధంగా ధోనీ తన 'ఓపెన్ డోర్ పద్ధతి' ద్వారా టీమ్ మధ్య బంధాన్ని, సమన్వయాన్ని పెంచారని, CSK విజయం వెనుక ఈ రిలాక్స్డ్ వాతావరణం కూడా ఒక ముఖ్య కారణం అని మైక్ హస్సీ కొనియాడారు.

