గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ ఎప్పటి నుంచి అంటే.?

Telangana Golf Premier League: తెలంగాణ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (TPGL) ఐదవ సీజన్ అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్ శ్రీనిధి యూనివర్సిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, గోల్కొండలో నవంబర్ 23 వరకు జరగనుంది.

ఈ సీజన్‌లో 16 జట్లు పాల్గొంటాయి. మొత్తం 192 మంది గోల్ఫర్లు బరిలో నిలిచారు (ప్రతి జట్టులో 12 మంది). హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (HGA) దీనిని నిర్వహిస్తుంది.

ఈ లీగ్ ఫార్మాట్‌లో 5 వారాల వ్యవధిలో మూడు వేర్వేరు ఫార్మాట్లలో మొత్తం 8 రౌండ్లు ఆడతారు.

లీగ్‌‌ మ్యాచ్‌‌లు ప్లే ఫార్మాట్‌‌లో జరుగుతాయి. తర్వాత రెండు నాకౌట్స్‌‌, గ్రాండ్‌‌ ఫైనల్‌‌ ఉంటుంది. గ్రూప్‌‌–ఎలో ఆటమ్‌‌ చార్జర్స్‌‌, టీమ్‌‌ టీ ఆఫ్‌‌, డెక్కన్‌‌ నవాబ్స్‌‌, లండన్‌‌ రాయల్స్‌‌, కేయూఎన్‌‌ ఎక్స్‌‌క్లూజివ్‌‌, ఎంవైకే స్ట్రయికర్స్‌‌, హెల్దీ ఫెయిర్‌‌వేస్‌‌, లైఫ్‌‌స్పాన్‌‌ లయన్స్‌‌.. గ్రూప్‌‌–బిలో గన్నర్స్‌‌ వికారా, స్ట్రాజ్‌‌, హైదరాబాద్‌‌ స్లేయర్స్‌‌, మావెరిక్స్‌‌, శ్రీనిధి థండర్‌‌ బోల్ట్స్‌‌, వ్యాలీ వారియర్స్‌‌, కేఎల్‌‌ఆర్‌‌ కింగ్స్‌‌, విశ్వ సముద్ర గోల్డెన్‌‌ ఈగల్స్‌‌ పోటీపడుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story