ఐసీసీ విమెన్స్‌‌‌‌‌ వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఇండియా, శ్రీలంకలో జరగనుంది. కొలంబోను తటస్థ వేదికగా చేర్చినట్లు ఐసీసీ ప్రకటించింది. ఇండియాలో బెంగళూరు, గువాహతి, ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విశాఖపట్నంలో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి. నిజానికి ఎనిమిది జట్లు పాల్గొనే ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియానే ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, హైబ్రిడ్ నమూనా ప్రకారం పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కొలంబోలో నిర్వహిస్తారు. తొలి సెమీఫైనల్ అక్టోబర్ 29న గువాహటి లేదా కొలంబోలో జరుగుతుంది. రెండో సెమీఫైనల్ అక్టోబర్ 30న బెంగళూరులో షెడ్యూల్ చేశారు. ఫైనల్ నవంబర్ 2న బెంగళూరు లేదా కొలంబోలో జరుగుతుంది. ఆతిథ్య ఇండియా పాటు, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా ఈ టోర్నీలో పాల్గొంటాయి.

Updated On 3 Jun 2025 11:31 AM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story