డబుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్ ఎవరు?

Cricket Test Captain: ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ డబుల్ సెంచరీతో మెరిశాడు. 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 269 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌లో ఒక ఆసియా కెప్టెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన 3వ భారత కెప్టెన్‌గా అతను నిలిచాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ప్రపంచ రికార్డు విరాట్ కోహ్లీ సొంతం. కెప్టెన్‌గా కోహ్లీ 7 డబుల్ సెంచరీలు చేశాడు. వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా ఈ జాబితాలో 2వ స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా లారా 5 డబుల్ సెంచరీలు సాధించాడు. లారా మొత్తం టెస్టుల్లో 9 డబుల్ సెంచరీలు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ప్రపంచ రికార్డును ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ కలిగి ఉన్నాడు. బ్రాడ్‌మాన్ మొత్తం 12 డబుల్ సెంచరీలు సాధించాడు, వాటిలో 4 కెప్టెన్‌గా ఉన్నాయి. దక్షిణాఫ్రికా దిగ్గజ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 4 డబుల్ సెంచరీలు సాధించాడు. అతను మొత్తం 5 డబుల్ సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. కెప్టెన్ గా టెస్ట్‌లలో కెప్టెన్‌గా 4 డబుల్ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 329 పరుగులు. ఆస్ట్రేలియా గొప్ప కెప్టెన్లలో ఒకరైన రికీ పాంటింగ్ 2003-2010 మధ్య కెప్టెన్‌గా 3 డబుల్ సెంచరీలు సాధించాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story