ఇవాళే ఐపీఎల్ మినీ వేలం

IPL Mini Auction: ఇవాళ ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. ఎతిహాద్ అరేనా, అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవుతుంది.మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిసి గరిష్టంగా 77 స్లాట్‌లు (ఖాళీలు) భర్తీ చేయాల్సి ఉంది. మొత్తంగా 350 మంది క్రికెటర్లు బరిలో ఉన్నారు. క్యామరూన్ గ్రీన్, లియామ్ లివింగ్‌స్టోన్, వెంకటేశ్ అయ్యర్ వంటి ఆటగాళ్లపై భారీగా బిడ్డింగ్ జరిగే అవకాశం ఉంది.కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వద్ద అత్యధికంగా రూ.64.30 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వద్ద రూ. 43.40 కోట్లు ఉన్నాయి.

గ్రీన్‌‌‌‌‌‌‌‌తో పాటు కేకేఆర్ రిలీజ్ చేసిన ఇండియా ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ వెంకటేష్ అయ్యర్, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌, వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్‌‌‌‌‌‌‌‌కు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. వెంకటేష్ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గతంలో రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్ రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) అవకాశం లేని ఈ మినీ వేలంలో అతన్ని తిరిగి దక్కించుకోవడానికి మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తనకు కనీసం రూ. 10 కోట్లు పలుకుతాడని అంచనా. ఇక, ఈ వేలంలో గ్రీన్ బిడ్ రూ. 25 కోట్లు దాటినా ఐపీఎల్ గరిష్ట రుసుము నిబంధన ప్రకారం ఈ సీజన్‌‌‌‌లో అతనికి జీతంగా రూ. 18 కోట్లు (అత్యధిక రిటెన్షన్ స్లాబ్) మాత్రమే అందనుంది. బిడ్ మొత్తం జట్టు పర్స్ నుంచి కట్ అవుతుంది. కానీ, ఆటగాడికి మాత్రం రూ. 18 కోట్లే చెల్లిస్తారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story