జోరు కొనసాగేనా.?

Alcaraz: కార్లోస్‌‌ అల్కరాజ్‌‌వింబుల్డన్‌‌కు రెడీ అయ్యాడు. ఇవాళ్టి నుంచి జరిగే మెయిన్‌‌ డ్రా పోటీల్లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. ఆరేళ్ల కిందట ఇక్కడ తొలి మ్యాచ్‌‌ ఆడిన అల్కరాజ్‌‌ 2023, 2024లో చాంపియన్‌‌గా నిలిచాడు. ఇప్పుడు కూడా అదే జోరును కొనసాగించి హ్యాట్రిక్‌‌ టైటిల్స్‌‌ను సాధించాలని భావిస్తున్నాడు. సోమవారం ఫ్యాబియో ఫోగ్నిని (ఇటలీ)తో జరిగే తొలి మ్యాచ్‌‌తో టోర్నీని ప్రారంభించనున్నాడు. డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ హోదాలో ఈసారి అన్ని మ్యాచ్‌‌లను సెంటర్‌‌ కోర్టులోనే ఆడనున్నాడు. 1968 ఓపెన్‌‌ ఎరాలో కేవలం జోర్న్‌‌ బోర్గ్‌‌, పీట్‌‌ సంప్రాస్‌‌, రోజర్‌‌ ఫెడరర్‌‌ మాత్రమే హ్యాట్రిక్‌‌ టైటిల్స్‌‌ నెగ్గారు.

గ్రాండ్‌‌ స్లామ్‌‌ ఫైనల్స్‌‌లో అల్కరాజ్‌‌ 5–0తో మంచి రికార్డు కూడా ఉంది. గతేడాది రెండో ర్యాంక్‌‌ ప్లేయర్‌‌గా బరిలోకి దిగిన అల్కరాజ్‌‌.. టైటిల్‌‌ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో రెండు సెట్లు వెనకబడినా కోలుకుని చాంపియన్‌‌గా నిలిచాడు. ఇప్పుడు వింబుల్డన్‌‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. గత వారంతంలో క్వీన్స్‌‌ క్లబ్ టోర్నీతో సహా కెరీర్‌‌లో అత్యుత్తమ 18 మ్యాచ్‌‌ల విజయ పరంపరను కలిగి ఉన్నాడు. మరోవైపు కెరీర్‌‌లో 24వ గ్రాండ్‌‌స్లామ్‌‌ వేటలో ఉన్న సెర్బియా స్టార్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌ కూడా టైటిల్‌‌పై దృష్టి పెట్టాడు. వింబుల్డన్‌‌లో ఏడుసార్లు చాంపియన్‌‌గా నిలిచిన జొకో.. గత రెండేళ్లలో అల్కరాజ్‌‌ చేతిలో ఓడి రన్నరప్‌‌తో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలని సెర్బియన్‌‌ ప్లేయర్‌‌ భావిస్తున్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story