గిల్ హిట్టవుతాడా?

Gill: ఒక ఆటగాడిగా ఇంకా ఎదుగుతున్న దశలోనే ఇంగ్లండ్‌లో ఇండియా టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ చేపట్టడం అనే కఠినమైన బాధ్యతను శుభ్‌మాన్ గిల్ స్వీకరించాడు. ఇది తనపై మామూలు భారం కాదు. స్వదేశంలో అతని టెస్టు సగటు 42.03 బాగానే ఉంది. కానీ, విదేశాల్లో (29.50)మాత్రం తేలిపోతున్నాడు. పైగా, ఇంగ్లండ్‌లో ఆడిన 3 టెస్టుల్లో కేవలం 14.66 సగటుతో 88 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో ఈ సిరీస్ అతని బ్యాటింగ్ టెక్నిక్కే కాకుండా మానసిక స్థైర్యానికి పెద్ద పరీక్ష అవుతుంది. తను క్రీజులో ఎంతసేపు నిలబడతాడన్న దానికంటే ఒత్తిడిలో జట్టును ఎలా నడిపిస్తాడన్న దానిపైనే అందరి దృష్టి ఉంటుంది.
కెప్టెన్సీ భారం అతని బ్యాటింగ్ పై ప్రభావం చూపుతుందా లేక అదనపు బాధ్యతతో మరింత రాటుదేలుతాడా అనేది ఈ సిరీస్‌లో తేలి పోనుంది. ఏదేమైనా మోడ్రన్ గ్రేట్స్ కోహ్లి, రోహిత్ ఇద్దరూ లేకుండా 2011 తర్వాత ఇండియా ఆడుతు న్న తొలి పూర్తి స్థాయి టెస్ట్ సిరీస్ ఇది. ఈ నేపథ్యం లో రాహుల్, జైస్వాల్, గిల్ వ్యక్తిగత పెర్ఫామెన్స్ మాత్రమే కాకుండా వారి సమష్టి కృషి జట్టుకు అత్యంత కీలకం కానుంది. ఈ ముగ్గురి బ్యాట్ల నుంచి వచ్చే రన్స్ ఈ సిరీస్ ఫలితాన్నే కాకుండా ఇండియా టెస్ట్ టీమ్ భవిష్యత్ దిశను కూడా నిర్దేశి స్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
