2nd ODI Tomorrow: గెలిస్తే సిరీస్.. రేపే సెకండ్ వన్డే
రేపే సెకండ్ వన్డే

2nd ODI Tomorrow: ఉమెన్స్ ఇండియా ఇంగ్లాండ్ తో రెండో వన్డేకు సిద్ధమవుతోంది. రేపు మధ్యాహ్నం 3.30గంటలకు లార్డ్స్ లో జరగనుంది. ఇప్పటికే ఫస్ట్ వన్డే గెలిచిన ఇండియా జోష్ మీద ఉంది. రెండో వన్డేలో గెలిచి మూడు వన్డేల సిరీస్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఇండియ టీ20 సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఇండియా,ఇంగ్లాండ్ 77 మ్యాచుల్లో తలపడగా.. ఇండియా 35 , ఇంగ్లాండ్ 40 మ్యాచుల్లో గెలిచింది. రెండు మ్యాచుల్లో ఫలితం రాలేదు.
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (c), స్మృతి మంధాన (vc), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (wk), యాస్తిక భాటియా (wk), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, షుచి ఉపాద్యా రెడ్డి, శుచి ఉపాద్యా రెడ్డి క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.
ఇంగ్లాండ్ జట్టు: నాట్ స్కైవర్ -బ్రంట్ (కెప్టెన్), ఎమ్ అర్లాట్, సోఫియా డంక్లీ, ఎమ్మా లాంబ్, టామీ బ్యూమాంట్ (కీపర్), అమీ జోన్స్ (కీపర్), మైయా బౌచియర్, ఆలిస్ కాప్సే, కేట్ క్రాస్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్, చార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, లిన్సే స్మిత్, లారెన్ బెల్.
