క్షమాపణలు చెప్పిన వోక్స్

Woakes Apologizes: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌, భారత బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌కు క్షమాపణలు చెప్పాడు. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో భాగంగా వోక్స్‌ వేసిన ఒక బంతి పంత్‌ కాలికి బలంగా తాకింది. దీంతో పంత్‌ కాలికి ఫ్రాక్చర్‌ అయింది. ఈ గాయం కారణంగా పంత్‌ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే, ఈ సిరీస్‌ ముగిసిన తర్వాత ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంది. ఐదవ టెస్టులో వోక్స్‌ గాయపడినా బ్యాటింగ్‌ చేయడానికి వచ్చినందుకు పంత్‌ అతడిని అభినందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సాల్యూట్‌ ఎమోజీతో పోస్ట్‌ పెట్టాడు. దీనికి స్పందించిన వోక్స్‌, పంత్‌కు ధన్యవాదాలు చెప్పి, అతడి కాలు ఎలా ఉందో అడిగాడు. దీనికి పంత్‌ వాయిస్‌ నోట్‌ పంపించి, వోక్స్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఈ సంఘటనతో చలించిపోయిన వోక్స్‌, పంత్‌కు క్షమాపణలు చెబుతూ, తన బంతి వల్లే పంత్‌ కాలు ఫ్రాక్చర్‌ అయిందని వివరించాడు. క్రిక్‌టెట్‌లో ఇలాంటి క్రీడా స్ఫూర్తిని చూపినందుకు పంత్‌, వోక్స్‌లను అభిమానులు అభినందిస్తున్నారు. కాగా గాయంతోనూ బ్యాటింగ్‌కు వచ్చినందుకు భారత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ తనకు అభినందనలు తెలిపాడని వోక్స్‌ వెల్లడించాడు. తాను బ్యాటింగ్‌కు దిగకూడదని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story