Hockey:ఆసియా కప్‌‌‌‌‌‌ విమెన్స్ హాకీ టోర్నమెంట్‌ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. సెప్టెంబర్ 5న మొదలయ్యే ఈ టోర్నీలో తొలి రోజు ఇండియా- థాయ్‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌ జట్లు పోటీ పడనున్నాయి. ఆ తర్వాత డిఫెండింగ్ చాంపియన్ జపాన్ (సెప్టెంబర్ 6), సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సెప్టెంబర్ 8) తో ఇండియా తలపడనుంది. ఈ మేరకు హాకీ ఇండియా షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది.

గత ఎడిషన్‌‌‌‌‌‌లో కాంస్య పతకం సాధించిన ఇండియా ఈసారి జపాన్, థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్, సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి పూల్– బిలో బరిలో నిలిచింది. పూల్–ఎలో ఆతిథ్య చైనా, కొరియా, మలేసియా, చైనీస్ తైపీ జట్లు ఉన్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 5 నుంచి 14 వరకు చైనాలోని హాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జౌలో జరగనుంది. విజేతగా నిలిచే జట్టు 2026 హాకీ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నేరుగా క్వాలిఫై అవుతుంది. ప్రతీ పూల్ నుంచి టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2జట్లు సూపర్– 4 పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంటాయి. అక్కడ ప్రతీ జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. సూపర్– 4 పూల్ లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 టీమ్స్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.Women

PolitEnt Media

PolitEnt Media

Next Story