Women's Premier League (WPL) 2026: ఆర్సీబీదే డబ్ల్యూపీఎల్ టైటిల్
డబ్ల్యూపీఎల్ టైటిల్

Women's Premier League (WPL) 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుతమైన ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘనవిజయం సాధించి, రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.
టాస్ ఓడిన ఢిల్లీ 20 ఓవర్లలో 203/4 స్కోరు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (37 బాల్స్‌లో 8 ఫోర్లతో 57), లారా వోల్‌వర్ట్ (25 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), చినెల్లీ హెన్రీ (15 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) చెలరేగారు. ఢిల్లీ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఛేదించింది. కెప్టెన్ స్మృతి మంధాన 87 పరుగులతో (కేవలం 41 బంతుల్లో) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా, జార్జియా వోల్ (79) ఆమెకు అద్భుతమైన సహకారం అందించింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన చేసిన 87 పరుగులు డబ్ల్యూపీఎల్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా రికార్డు సృష్టించింది.. స్మృతికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఆర్సీబీ కేవలం ఈ ఏడాదే కాదు, అంతకుముందు 2024లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి తన మొదటి WPL టైటిల్‌ను గెలుచుకుంది. దీనితో డబ్ల్యూపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌తో సమానంగా (రెండు టైటిల్స్) అత్యంత విజయవంతమైన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఇది డబుల్ ధమాకా! ఎందుకంటే పురుషుల ఐపీఎల్ (IPL 2025)లో కూడా రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

