Women's World Cup: వుమెన్స్ వరల్డ్ కప్ ..టీమిండియా బోణీ
టీమిండియా బోణీ

Women's World Cup: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి తమ టోర్నీని విజయవంతంగా ప్రారంభించింది.దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బ్యాటింగ్‌లో 53 పరుగులు, బౌలింగ్‌లో 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.అమన్‌జోత్ కౌర్ బ్యాటింగ్57 పరుగులతో అద్భుతమైన అర్ధ సెంచరీ చేసి జట్టుకు మంచి స్కోర్ అందించింది.ఈ విజయం భారత జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
టార్గెట్ బరిలో శ్రీలంక 45.4 ఓవర్లలో 211 రన్స్‌కే ఆలౌలైంది. కెప్టెన్ చమరి ఆటపట్టు (43), నీలాక్షికా సిల్వ (35), హర్షిత (29) పోరాడినా పలితం లేకపోయింది. దీప్తి మూడు, స్నేహ్ రాణా, శ్రీచరణి రెండు వికెట్లతో దెబ్బకొట్టారు. దీప్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ టోర్నీలో భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌ని అక్టోబర్ 5న పాకిస్థాన్‌తో ఆడనుంది.
