శ్రీలంక టార్గెట్ ఎంతంటే?

Women's World Cup: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ లో శ్రీలంక తో జరుగుతోన్న మ్యాచ్ లో భారత్ 269 పరుగులు చేసింది. వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో ప్రతికా రావెల్ 37, హర్లీన్ డియోల్ 48, దీప్తి శర్మ 53, అమన్ జోత్ కౌర్ 57 పరుగులతో చెలరేగడంతో టీమిండి 8 వికెట్లు కోల్పోయి 269పరుగులు చేయగల్గింది. శ్రీలంకకు 270 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక బౌలర్లలో రనవీరా 4 వికెట్లతో అదరగొట్టింది. ఉదేశిక ప్రభోధని రెండు వికెట్లు, అచిని, చామరికి చెరో ఒక వికెట్ పడింది. టార్గెట్ బరిలోకి దిగిన శ్రీలంక ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసే సరికి 16 పరుగులు చేసింది. క్రీజులో హసిని పెరెరా 6, చామరి 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇండియా జట్టు

ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (c), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (WK), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి

శ్రీలంక జట్టు

చమరి అథాపత్తు (సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని (Wk), అచ్చిని కులసూర్య, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోధని, ఇనోకా రణవీర

PolitEnt Media

PolitEnt Media

Next Story