WomensHockeyWorldCup: ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2026 ఫైనల్ మ్యాచ్ ఈరోజు జరగనుంది.హైదరాబాద్‌లోని గచ్చిబౌలి (G.M.C. బాలయోగి) హాకీ స్టేడియంలో నిన్న జరిగిన సెమీఫైనల్‌లో భారత్ 1-0తో ఇటలీపై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో పాటు 2026 వరల్డ్ కప్‌కు భారత్ తన బెర్తును కూడా ఖరారు చేసుకుంది. మరో సెమీస్‌‌‌‌లో ఇంగ్లండ్ 2–0తో స్కాట్లాండ్‌‌‌‌ను ఓడించి ఫైనల్లో అడుగు పెట్టింది. ఇంగ్లిష్ టీమ్ కూడా వరల్డ్ కప్‌‌‌‌ బెర్తు సొంతం చేసుకుంది. ఇటలీ, స్కాట్లాండ్ మధ్య శనివారం జరిగే బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌‌‌‌లో నెగ్గిన జట్టుకు మరో బెర్తు లభిస్తుంది.

నిన్నటి మ్యాచ్‌లో మనీషా చౌహాన్ 40వ నిమిషంలో చేసిన అద్భుతమైన ఫీల్డ్ గోల్ భారత్‌కు విజయాన్ని అందించింది. ఇటలీ జట్టు చివరి నిమిషం వరకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, భారత డిఫెండర్లు,గోల్ కీపర్ బిచ్చు దేవి ఖరిబమ్ గోల్ పడకుండా అడ్డుకుని గోడలా నిలబడ్డారు. ఈ విజయంతో భారత్ కేవలం ఫైనల్‌కు చేరడమే కాకుండా, వచ్చే ఏడాది నెదర్లాండ్స్ ,బెల్జియం దేశాల్లో జరగనున్న 2026 ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ కు అధికారికంగా అర్హత సాధించింది. ఈ రోజు ఇంగ్లాండ్‌తో జరిగే పోరులో మన అమ్మాయిలు టైటిల్ నెగ్గాలని కోరుకుందాం.

PolitEnt Media

PolitEnt Media

Next Story