వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్..

World Boxing Championship: ఇవాళ్టి నుంచి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌లో ఉన్న M&S బ్యాంక్ అరేనాలో జరుగుతోంది.సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు కొనసాగుతాయి.ఇది వరల్డ్ బాక్సింగ్ అనే కొత్త గ్లోబల్ గవర్నింగ్ బాడీచే నిర్వహించబడిన మొట్టమొదటి ఛాంపియన్‌షిప్. ఈ టోర్నమెంట్ ఒకేసారి పురుషులు , మహిళల పోటీలను నిర్వహిస్తోంది ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం.

65కి పైగా దేశాల నుండి 550 మందికి పైగా బాక్సర్లు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నారు.భారతదేశం నుండి టోక్యో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్‌తో సహా మొత్తం 20 మందితో కూడిన బలమైన బృందం ఈ టోర్నమెంట్‌లో పోటీపడుతోంది.

పాకిస్తాన్ కి చెందిన ఒలింపిక్ విజేత బాక్సర్ లిన్ యూ-టింగ్ లింగ వివక్ష కారణంగా ఈ టోర్నమెంట్ నుండి తప్పుకున్నారు. రెండు రింగులలో బౌట్‌లు జరుగుతున్నాయి. క్వార్టర్ ఫైనల్స్, సెమీ-ఫైనల్స్, ఫైనల్స్ సమయంలో ఒకే రింగ్‌పై దృష్టి సారిస్తారు.ఈవెంట్ లైవ్ ,ఆన్-డిమాండ్ కవరేజ్ యూరోవిజన్ స్పోర్ట్ ద్వారా చూడొచ్చు.

భారత నుంచి టోక్యో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్‌తో సహా మొత్తం 20 మందితో కూడిన బృందం ఈ టోర్నమెంట్‌లో పోటీపడుతోంది.భారతీయ బాక్సర్లకు తొలి రౌండ్లలోనే గట్టి పోటీ ఎదురు కానుంది. మహిళల విభాగంలో నిఖత్ జరీన్‌, లవ్లీనా బోర్గోహైన్‌పై ప్రత్యేకంగా దృష్టి ఉంది.

అమెరికాకు చెందిన 14 మంది బాక్సర్ల బృందం, ఉజ్బెకిస్తాన్ బృందం, బ్రెజిల్ బృందం, ఫ్రాన్స్ బృందం నుండి కూడా గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story