వరల్డ్ పారా అథ్లెటిక్ చాంపియన్ షిప్

World Para Athletics Championship: ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది. ఈ పోటీలు ఇవాళ్టి నుంచి అక్టోబర్ 5 వరకు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్నాయి.. భారత్ ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి.

100 కంటే ఎక్కువ దేశాల నుండి 2,200 మందికి పైగా పారా అథ్లెట్లు ఈ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొంటున్నారు. ఇందులో మొత్తం 186 పతకాల ఈవెంట్లు ఉన్నాయి. వీటిలో 101 పురుషుల ఈవెంట్లు, 84 మహిళల ఈవెంట్లు, ఒక మిక్స్డ్ ఈవెంట్ ఉన్నాయి.ఈ ఛాంపియన్‌షిప్‌లలో భారత్ నుంచి 74 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ మెగా టోర్నీలో భారత్ టాప్-5లో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్ ఆటగాళ్లు

సుమిత్ ఆంటిల్ (జావెలిన్ త్రో)

ప్రీతి పాల్ (స్ర్రింట్స్)

ప్రవీణ్ కుమార్ (హై జంప్)

ధరంబీర్ (క్లబ్ త్రో)

నవదీప్ (జావెలిన్ త్రో)

జీవాంజి దీప్తి (400మీ పరుగు)

బానోతు అకీరా నందన్ (400మీ పరుగు)

రొంగలి రవి (షాట్‌పుట్)

PolitEnt Media

PolitEnt Media

Next Story