Summer McIntosh: వావ్.. 3 రోజుల్లో 2 వరల్డ్ రికార్డ్స్
3 రోజుల్లో 2 వరల్డ్ రికార్డ్స్

Summer McIntosh: కెనడా టీనేజ్ స్విమ్మర్ మూడురోజుల్లో రెండు వరల్డ్ రికార్డులు నెలకొల్పింది. విమెన్స్ 200 మీటరల్ వ్యక్తిగత మెడ్లేని మెకింతోష్ 2:5.7 సెకన్లలో పూర్తి చేసి హంగేరియన్ గ్రేట్ కటింకా హోస్జు రికార్డ్ ను బ్రేక్ చేసింది. దాంతో 2015లో హంగేరియన్ గ్రేట్ కటింకా హోస్జు నెలకొల్పిన వరల్డ్ రికార్డు (2ని,06.12 సెకన్లు)ను బ్రేక్ చేసింది. ఇక అంతకుముందు శనివారం జరిగిన 400 మీటర్ల ఫ్రీ స్టయిల్‌ను మెకింతోష్ 3:54.18 సెకన్లలో ముగించింది. ఫలితంగా ఆస్ట్రేలియా స్విమ్మర్ అరియార్నే టిట్మస్ నెలకొల్పిన పాత వరల్డ్ రికార్డు (3:55.38 సెకన్లు)ను అధిగమించింది.
ఒకసారి ఒక్క రేసును మాత్రమే తీసుకుంటున్నా. హీట్స్‌లో మంచి పెర్ఫామెన్స్ రావడంతో ఫైనల్‌లోనూ దాన్ని రిపీట్ చేసేందుకు ప్రయత్నించానని మెకింతోష్ తెలిపింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో మెకింతోష్ మూడు స్వర్ణాలు (400, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే, 200 మీటర్ల బటర్‌ఫ్లయ్) నెగ్గింది. 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో సిల్వర్‌తో సరిపెట్టుకుంది.
