Women's Premier League (WPL) 2026: డబ్ల్యూపీఎల్ : ఇవాళ గుజరాత్- ఢిల్లీ ఎలిమినేటర్ పోరు
గుజరాత్- ఢిల్లీ ఎలిమినేటర్ పోరు

Women's Premier League (WPL) 2026: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) కీలక దశకు చేరుకుంది. ఇవాళ రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన 'ఎలిమినేటర్' మ్యాచ్ జరగనుంది. వడోదరలోని బీసీఏ (BCA) స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు గురువారం (ఫిబ్రవరి 5) జరిగే ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో తలపడుతుంది. ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
జట్ల బలాబలాలు
జెమీమా రోడ్రిగ్స్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు.. చివరి లీగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను ఓడించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. షఫాలీ వర్మ, లారా వోల్వార్ట్ ,మరిజేన్ కాప్ వంటి స్టార్ ప్లేయర్లతో జట్టు పటిష్టంగా ఉంది.ఆష్లీ గార్డ్‌నర్ నేతృత్వంలోని గుజరాత్ ఈ సీజన్‌లో నిలకడగా రాణించి రెండో స్థానంలో నిలిచింది. సోఫీ డివైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆ జట్టుకు ప్రధాన బలం. లీగ్ దశలో ఢిల్లీపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గడం గుజరాత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం.గత మూడు సీజన్లలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు చేరుకుంది కానీ టైటిల్ గెలవలేకపోయింది. ఈసారి కూడా ఫైనల్‌కు దూసుకెళ్లి కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ తొలిసారి ఫైనల్‌కు చేరాలని చూస్తోంది.

