Women's Premier League (WPL) 2026: డబ్ల్యూపీఎల్ ..ఫైనల్ కు దూసుకెళ్లిన ఆర్బీబీ
ఫైనల్ కు దూసుకెళ్లిన ఆర్బీబీ

Women's Premier League (WPL) 2026: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ప్రయాణాన్ని సాగిస్తోంది. యూపీ వారియర్స్‌పై ఘనవిజయం సాధించి, ఆర్సీబీ మరోసారి ఫైనల్‌కు చేరుకుంది.శనివారం జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు యూపీ వారియర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో143 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ వారిని కట్టడి చేశారు.ఆర్సీబీ బౌలింగ్‌లో ముఖ్యంగా స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. పరుగులను నియంత్రించడమే కాకుండా కీలక సమయాల్లో వికెట్లు తీసి యూపీని ఒత్తిడిలోకి నెట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ స్మృతి మంధాన54 పరుగులు, గ్రేస్ హారిస్ 75 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయానికి చేరువ చేశారు.మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు సంయమనంతో ఆడి కేవలం 2 వికెట్లు కోల్పోయి 13.1ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు.ఈ ఓటమితో యూపీ ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది.

