WTC Final: కమిన్స్ తిరిగి వచ్చాడు.. ఆసీస్ ప్లేయింగ్- ఎలెవన్ ఇలా!
ఆసీస్ ప్లేయింగ్- ఎలెవన్ ఇలా!

WTC Final:బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌ను 3-1 తేడాతో ఓడించి, శ్రీలంకలో సిరీస్‌ను గెలుచుకున్న తర్వాత ఆస్ట్రేలియా మరోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్‌కు చేరుకుంది. జూన్ 11 నుండి లార్డ్స్‌లో జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. చివరి పోరు కోసం ఆస్ట్రేలియా పూర్తి జట్టును ప్రకటించింది. గాయం కారణంగా సెప్టెంబర్ 2024లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు దూరమైన కామెరాన్ గ్రీన్ తిరిగి రావడం ఆస్ట్రేలియాకు కలిసివచ్చే అంశం. ట్రావిస్ హెడ్ తో కలిసి ఉస్మాన్ ఖవాజా ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. గ్రీన్ ఇంకా జట్టులో ఉండటంతో, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు జట్టులోకి వస్తారు. అలెక్స్ కారీ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ గా ఉంటాడు. శ్రీలంకతో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ కోసం ప్లేయింగ్ 11లో మార్పులను పరిశీలిస్తే, కామెరాన్ గ్రీన్, పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్ తిరిగి జట్టులోకి వచ్చారు, బ్యూ వెబ్‌స్టర్, కూపర్ కొన్నోలీ, మాథ్యూ కుహ్నెమాన్‌లను తొలిగించారు.
WTC ఫైనల్ ఆస్ట్రేలియా జట్టు
ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, కామెరాన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్, ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్, మాట్ కుహ్నెమాన్. ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్
WTC ఫైనల్ దక్షిణాఫ్రికా జట్టు
టోనీ డి జోర్జి, ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రామ్, టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, డేన్ ప్యాటర్సన్, కేశవ్ మహారాజ్.
