WTC FINAL: రఫ్ఫాడించిన రబాడా.. ఫస్ట్ డేనే ఆస్ట్రేలియా ఆలౌట్
ఫస్ట్ డేనే ఆస్ట్రేలియా ఆలౌట్

WTC FINAL: ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఫస్ట్ ఇన్సింగ్స్‌లో సౌతాఫ్రికా స్టార్ పేసర్ రబాడా రఫ్ఫాడించాడు 5 వికెట్లతో చెలరేగిండు. సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో తొలి రోజే ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్‌స్టర్ (72) తప్ప మిగిలిన అందరూ విఫలం కావడంతో ఆసీస్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యింది. మార్కో యాన్సెన్ 3 వికెట్లతో రాణించగా.. కేశవ్ మహారాజ్, మార్కక్రమ్ చెరో వికెట్ తీశారు
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా సరైన శుభారంభం దక్కలేదు. ఫుల్ ఫామ్ లో ఉన్న ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా పరుగులేమి చేయడకుండానే రబాడ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఓపెనర్ గా ప్రమోట్ అయిన మార్నస్ లబుషేన్ (17) కూడా నిరాశ పర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ 4, ట్రావిస్ హెడ్ 13 పరుగులు మాత్రమే చేసి వెనువెంటనే పెవిలియన్ చేరారు.
స్టీవ్ స్మిత్, బ్యూ వెబ్‌స్టర్ ఆసీస్ ఇన్సింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. టీ బ్రేక్ తర్వాత మరోసారి సౌతాఫ్రికా బౌలర్లు విజృంభించడంతో స్టీవ్ స్మిత్ (66) , బ్యూ వెబ్‌స్టర్ (72) హాఫ్ సెంచరీలు చేసి ఔట్ అయ్యారు. చివర్లో అలెక్స్ క్యారీ (23) కాసేపు పోరాడాడు. క్యారీ ఔట్ కాగానే వెను వెంటనే వికెట్లు పడటంతో ఆసీస్ 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
