టాప్ 2కి సఫారీలు

WTC Points Table: భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ ఫలితం కారణంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పులు వచ్చాయి.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌పై దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతోనే దక్షిణాఫ్రికా టాప్‌-2లోకి దూసుకువచ్చింది.

భారత్‌పై విజయం సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా తమ పాయింట్ల శాతాన్ని 66.67%కి పెంచుకొని, శ్రీలంకతో సమానంగా ఉన్నప్పటికీ, గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య (దక్షిణాఫ్రికా 2, శ్రీలంక 1) ఆధారంగా రెండో స్థానానికి చేరుకుంది. ఈ ఓటమితో టీమిండియా 3వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోయింది.

జట్లను గెలిచిన మొత్తం పాయింట్ల కంటే, పాయింట్ల శాతం (PCT) ఆధారంగా ర్యాంక్ ఇస్తారు. సౌతాఫ్రికా, ఇండియా మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22న గువాహటిలో జరగనుంది, ఇది పాయింట్ల పట్టికలో మరింత మార్పులకు కారణమవుతుంది.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక

జట్టు పాయింట్లు

1 ఆస్ట్రేలియా 36

2 దక్షిణాఫ్రికా 24

3 శ్రీలంక 16

4 భారత్ (టీమిండియా) 52

5 పాకిస్తాన్ 12

6 ఇంగ్లాండ్ 26

7 బంగ్లాదేశ్ 4

8 వెస్టిండీస్ 0

PolitEnt Media

PolitEnt Media

Next Story