Yashasvi Jaiswal: 51 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన జైశ్వాల్
రికార్డ్ బద్దలు కొట్టిన జైశ్వాల్

Yashasvi Jaiswal: మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 51 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో టెస్ట్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్‌గా జైశ్వాల్ నిలిచాడు. గత 51 సంవత్సరాలుగా ఈ ఘనత ఏ భారత ఓపెనర్‌కూ సాధ్యం కాలేదు.
1974లో సుధీర్ నాయక్ 77 పరుగులు చేసిన తర్వాత, ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో భారత ఓపెనర్‌గా జైస్వాల్ ఈ రికార్డును సాధించాడు.ఈ మ్యాచ్‌లో జైశ్వాల్ 58 పరుగులు చేసి డాసన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.
ఈ ఇన్నింగ్స్‌తో జైశ్వాల్ ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 1000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి అతనికి కేవలం 16 ఇన్నింగ్స్‌లు మాత్రమే పట్టాయి. దీంతో ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 1000 పరుగులు అత్యంత వేగంగా సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. రాహుల్ ద్రవిడ్ 15 ఇన్నింగ్స్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
