పుజారా రిటైర్మెంట్‌పై కోహ్లీ రియాక్షన్..

Virat Kohli: ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాపై టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించారు. పుజారా వీడ్కోలుపై కాస్త ఆలస్యంగా స్పందించిన కోహ్లీ.. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పుజారా కెరీర్‌ను కొనియాడారు. పుజారా నంబర్ 3లో బ్యాటింగ్‌కు రావడం వల్లే తన నాలుగో స్థానంలో పని సులభమైందని కోహ్లీ అన్నారు. నంబర్‌ 4లో నా పనిని సులభం చేసిన పుజారాకు ధన్యవాదాలు. మీది అద్భుతమైన కెరీర్. మీరు భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు శుభాకాంక్షలు’’ అని కోహ్లీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.

ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయం

కోహ్లీ సారథ్యంలో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తొలిసారి టెస్ట్ సిరీస్ విజయం సాధించడంలో పుజారా కీలక పాత్ర పోషించారు. 2018లో జరిగిన ఆ పర్యటనకు ముందు, ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవని రికార్డుతో భారత్ వెళ్లింది. గత పర్యటనలో సెంచరీల మీద సెంచరీలు కొట్టిన విరాట్ కోహ్లీ, ఈసారి కూడా అద్భుత ప్రదర్శన చేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ ఆ సిరీస్‌లో కోహ్లీ సాధారణంగానే ఆడాడు.

అయినా సరే, టీమిండియా చారిత్రక విజయం సాధించింది. అందుకు ప్రధాన కారణం చతేశ్వర్ పుజారానే. ఆ సిరీస్‌లో మేటి ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని, ఆసీస్ బ్యాటర్లకు కూడా సాధ్యం కాని రీతిలో ఏకంగా 521 పరుగులు చేసి సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆ అద్భుతమైన ప్రదర్శనకు గానూ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' టైటిల్‌ను కూడా అందుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story