Young All-Rounder Arjun Tendulkar: లక్నో సూపర్ జెయింట్స్ గూటికి సచిన్ కొడుకు
సచిన్ కొడుకు

Young All-Rounder Arjun Tendulkar: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జరిగిన ఆటగాళ్ల ట్రేడింగ్‌లో అతిపెద్ద మార్పులలో ఒకటి చోటు చేసుకుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ (MI) జట్టును వీడి, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) గూటికి చేరారు. ఐపీఎల్ ట్రేడ్ విండోలో భాగంగా అర్జున్‌ను ముంబై ఇండియన్స్... లక్నో సూపర్ జెయింట్స్‌కు బదిలీ చేసింది. ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న అర్జున్ టెండూల్కర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ అతని ప్రస్తుత ధర అయిన రూ. 30 లక్షలకే ట్రేడింగ్ ద్వారా దక్కించుకుంది. ఈ ఆల్-రౌండర్‌కు కొత్త జట్టులో ఆటగాడిగా నిరూపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
అర్జున్ టెండూల్కర్ IPL ప్రయాణం (ముంబై ఇండియన్స్):
2021లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు.
2023లో తన IPL అరంగేట్రం చేశాడు.
ఇప్పటివరకు IPLలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడి, 3 వికెట్లు పడగొట్టాడు.
ముంబై ఇండియన్స్ జట్టును వీడుతున్న సందర్భంగా అర్జున్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
"ఈ జ్ఞాపకాలకు ధన్యవాదాలు. ఈ బ్యాడ్జ్ ధరించడం, జట్టులో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను, త్వరలో కలుద్దాం," అని అర్జున్ పేర్కొన్నారు.
అర్జున్ టెండూల్కర్ సోదరి సారా టెండూల్కర్ కూడా 'లవ్ యూ' అంటూ ఆ పోస్ట్‌కు స్పందించారు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం సైతం అర్జున్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, "మీ తదుపరి ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం" అని ప్రకటించింది. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన అర్జున్‌ను జట్టులోకి తీసుకోవడం ద్వారా, లక్నో సూపర్ జెయింట్స్ తమ బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తోందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ట్రేడ్ ద్వారా అర్జున్ తన తండ్రి నీడ నుంచి బయటపడి, సొంత గుర్తింపును ఏర్పరచుకునేందుకు ఒక సువర్ణావకాశం లభించింది.

