యువరాజ్ సింగ్ తండ్రి సంచలనం!

Yuvraj Singh's father, former cricketer Yograj Singh: భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ తన జీవితంలో అనుభవిస్తున్న తీవ్రమైన ఒంటరితనం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన కుటుంబ సభ్యులంతా దూరంగా ఉండడంతో, ఆహారం కోసం కూడా అపరిచితులపై ఆధారపడాల్సి వస్తుందని ఆయన భావోద్వేగంతో చెప్పారు.

సాయంత్రం ఒంటరిగా కూర్చుంటాను, ఇంట్లో ఎవరూ ఉండరు. ఆహారం కోసం అపరిచితులపై ఆధారపడతాను, ఒక్కొక్కసారి ఒకరు, ఒక్కొక్కసారి మరొకరు తెచ్చిస్తారు. నేనెవరినీ ఇబ్బంది పెట్టను. నాకు ఆకలి వేస్తే ఎవరో ఒకరు ఆహారం తెస్తారు" అని యోగ్రాజ్ సింగ్ ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

తన జీవితం పూర్తయిపోయిందని, తాను "చనిపోవడానికి సిద్ధంగా" ఉన్నానని ఆయన ప్రకటించారు. "నా జీవితం పూర్తయింది, దేవుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నన్ను తనతో తీసుకువెళ్లవచ్చు. నేను దేవుడికి చాలా కృతజ్ఞుడిని, నేను ప్రార్థిస్తాను, ఆయన ఇస్తూనే ఉంటారు" అని 62 ఏళ్ల యోగ్రాజ్ సింగ్ అన్నారు.

తన కుటుంబ సభ్యులందరినీ—తల్లి, పిల్లలు, కోడలు, మనవరాళ్లు—ప్రేమిస్తానని, కానీ వారిని ఏమీ అడగనని ఆయన స్పష్టం చేశారు. తన మొదటి భార్య, కొడుకు తనను వదిలి వెళ్లడం తన జీవితంలో పెద్ద షాక్ అని ఆయన గుర్తు చేసుకున్నారు. "నా జీవితాన్ని, నా యవ్వనాన్ని ఎవరి కోసం అంకితం చేశానో, వారు కూడా నన్ను వదిలి వెళ్లిపోగలరా?" అని ఆవేదన చెందారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story