Yuzvendra Chahal: 40 రోజులు 2 గంటలే నిద్ర.. సూసైడ్ చేసుకోవాలనుకున్నా..
సూసైడ్ చేసుకోవాలనుకున్నా..

Yuzvendra Chahal: టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ తన పెళ్లి, విడాకులు,వ్యక్తిగత జీవతం ఇటీవల తాను ఎదుర్కొన్న కొన్ని మానసిక ఇబ్బందులను ఫస్ట్ టైం బయటపెట్టాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్నాడు. చాహల్ ఇటీవల తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా మానసిక వేదన అనుభవించానని చెప్పాడు.చాలా మంది తనను 'మోసగాడు' అని అన్నారు అది తనను చాలా బాధించిందని చెప్పాడు.
విడాకుల ప్రక్రియ జరుగుతున్న సమయంలో, దాదాపు 40 రోజుల పాటు రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయానని, తీవ్రమైన ఆందోళన , డిప్రెషన్‌తో బాధపడ్డానని చెప్పాడు. ఈ సమయంలో తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని తెలిపాడు. ఈ మానసిక ఒత్తిడి కారణంగా క్రికెట్‌కు కూడా విరామం తీసుకోవాలని అనుకున్నానని చెప్పాడు.
చాహల్గతంలో జరిగిన మరో షాకింగ్ సంఘటన గురించి కూడా చెప్పాడు. 2013లో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నప్పుడు ఒక ప్లేయర్ పార్టీలో తాగిన మైకంలో తనను 15వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడదీశాడని చాహల్ చెప్పుకొచ్చాడు. అదృష్టవశాత్తూ, అక్కడ ఉన్న ఇతర వ్యక్తులు జోక్యం చేసుకోవడంతో తాను ప్రమాదం నుంచి తప్పించుకున్నానని తెలిపాడు చాహల్.
